హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాళాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా విషయంలో కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ (సెప్టెంబర్ 20) జరిగిన భేటీలో హైడ్రాకు విస్తృత అధికారులు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై హైడ్రాకు మరిన్నీ పవర్స్ కల్పించి.. పూర్తి స్వేచ్ఛగా పని చేసుకునేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ALSO READ | SLBC పనులకు రూ.4వేల 637 కోట్ల నిధులు: కేబినెట్ నిర్ణయం
దీనితో పాటుగా మరికొన్ని నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని మూడు యూరివర్శిటీల పేరు మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, టెక్స్ టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపుజి పేరు పెట్టేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుండే సన్న వడ్లకు రూ.500 బోనస్‌తో పాటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఎస్టీమేటేడ్ రివైజ్డ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.