తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్, సింగూరు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ 2025, జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి గుర్తుగా.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎస్. జైపాల్ రెడ్డి పీఆర్ఎల్‌ఐ ప్రాజెక్టుగా నామకరణం చేసింది.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు సింగూరు ప్రాజెక్ట్ పేరును కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత కాంగ్రెస్‌ నాయకుడు రాజనర్సింహ పేరు పెట్టింది. సింగూరు ప్రాజెక్టుకు సిలారపు రాజనర్సింహ ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ALSO READ | వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి బీజేపీనే దిక్కు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి