పెన్షన్ రికవరీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెన్షన్ రికవరీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పింఛన్ రికవరీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ రికవరీలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రికవరీ నోటీసులపై ప్రభుత్వం అధికారులకు క్లారిటీ ఇచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనర్హులకు లబ్ధి, రికవరీపై చర్చించాలని నిర్ణయించినట్లు సీఎస్ శాంతి కుమారి చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. తదుపరి ఉత్తర్వుల వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వుల్లో తెలిపారు. 
గత బీఆర్ ఎస్ ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చిన పింఛన్లలో అవకతవకలు జరిగాయని.. అనర్హులు ఆసరా పింఛన్లు పొందారని వాటిని వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వ్యా్ప్తంగా శనివారం నాటికి 1823 మందికి రికవరీ నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించారు.. పింఛన్లు తొలగించనున్న 1826 మంది జాబితాను రాష్ట్ర స్థాయి అధికారులు ఇప్పటికే జిల్లాలకు పంపించినట్లు తెలుస్తోంది.