హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంచలనాన్ని రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ములుపు చోటు చేసుకుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1200మంది ఫోన్లు ట్యాంపరింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకొని ఈ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.
జూన్ 4 (మంగళవారం) హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ జరపనుంది. హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.