
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు అయిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రావు పాస్ పోర్టును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు ఇప్పటికే రెడ్ కార్నర్ నటీసు ప్రక్రియ మొదలైనట్లు హైదరాబాద్ సిటీ పోలీసులకు సీబీఐ సమాచారం అందించింది. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. వైద్య చికిత్స కోసం వెళ్లిన ప్రభాకర్ రావు అక్కడే ఉండిపోయారు.
మాజీ పోలీసుల అధికారి ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దు చేసింది పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలిపారు. కీలక నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ఆయనకు గ్రీన్‌కార్డు నిరాకరించినట్టు తెలుస్తోంది.అమెరికా కాన్సులేట్-విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ఆయన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు హైదరాబాద్ పోలీసులు. పాస్‌పోర్టు రద్దు కావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
►ALSO READ | తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తండ్రి మృతి.. సీఎం రేవంత్ సంతాపం