ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. విదేశాల్లో ఉన్న నిందితులపై రెడ్ కార్నర్ నోటీస్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. విదేశాల్లో ఉన్న నిందితులపై  రెడ్ కార్నర్ నోటీస్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులపై  రెడ్ కార్నర్ నోటీస్ కు  మార్గం సుగమం అయ్యింది. రెడ్ కార్నర్ నోటీసు కు  సీబీఐ ఒప్పుకోవడం కీలక పరిణామంగా కనిపిస్తుంది.  ఈ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పై  రెడ్ కార్నర్ నోటీసును  ఇంటర్ పోల్ కు  సిఫారసు చేసింది సీబీఐ. 

రెడ్ కార్నర్ నోటీసులు సీబీఐ ద్వారా  ఇంటర్ పోల్ కు  చేరుకున్నట్లు తెలుస్తోంది.  హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సంతృప్తి చెందిన సిబిఐ.. ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్ పోల్ ను  కోరింది. సీబీఐ జారీ చేసిన నోటీసులతో 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనుంది ఇంటర్ పోల్.  

ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లు అమెరికా వదిలి వెళ్లిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. బెల్జియంలో శ్రవణ్ రావు ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో ప్రభాకర్ రావు కెనడాలో ఉన్నట్లు  పోలీసులు  గుర్తించారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ అయినందున ఇద్దరినీ ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నా సిటీ పోలీసులు.