
అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ఇన్విస్టిగేట్ చేస్తోన్న సీబీఐ అధికారులు త్వరలోనే మొదటి చార్జిషీట్‌ను దాఖలు చేయనున్నారు. వచ్చే వారం రోజుల్లో చార్జిషీట్ వేసేందుకు సీబీఐ అధికారులు రంగం సిద్ధం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఇష్యూలో ఇప్పటికే సీబీఐ అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మొదటి చార్జిషీట్ వేసిన తర్వాత రెండోదశ దర్యాప్తును సీబీఐ అధికారులు ముమ్మరం చేయనున్నారు.
►ALSO READ | తమ స్టైల్లో మర్యాదలు చేసిన గుజరాత్ పోలీసులు.. అఘోరీ చెర నుంచి బయటపడ్డ శ్రీవర్షిణి
మొదటి దశలో పాత్రధారులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రెండో దశలో సూత్రధారులపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి టెండర్ దక్కేటట్లుగా టెండర్ నిబంధనలను మార్చిన సూత్రధారులపై దర్యాప్తు షూరు చేయనున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలకవర్గంలోని కొంతమంది సభ్యులు, టీటీడీలోని కొంతమంది అధికారులపై ఇప్పటికే సిట్‌కు సమాచారం అందినట్లు సమాచారం. సీబీఐ ఛార్జ్ షీట్, రెండో దశ విచారణపై టీటీడీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. రెండో దశ విచారణలో ఎవరి పేర్లు బయటకు వస్తాయని ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.