6.1 శాతానికి తగ్గిన కీలక ఇన్‌‌‌‌ఫ్రా రంగాల వృద్ధి

6.1 శాతానికి తగ్గిన కీలక ఇన్‌‌‌‌ఫ్రా రంగాల వృద్ధి

న్యూఢిల్లీ: సహజవాయువు, క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గుదల కారణంగా ఈ ఏడాది జులైలో ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి 6.1 శాతానికి తగ్గింది.     గత జూన్‌‌‌‌లో వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది.  బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్  విద్యుత్ వంటి ప్రధాన రంగాల వృద్ధి జులై 2023లో 8.5 శాతంగా ఉంది.  

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-–జులై మధ్య ప్రధాన రంగాల ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6.1 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది.