బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిశోర్ ఇవాళ (అక్టోబర్ 16) టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని దాన కిషోర్ ఆదేశించారు.
ALSO READ | తెలంగాణకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు..!
వర్ష భావ పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలువ కుండా క్షేత్రస్థాయిలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీస్, వాటర్ వర్క్స్ విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని నగర వాసులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.