
మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. గూడూరు మండలంలో పీఎస్ చైర్మన్ చల్లా లింగారెడ్డితో పాటు సర్పంచ్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పలువురు కార్యకర్తలు రాజీనామా చేశారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ విధానాలు నచ్చకనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఎమ్మెల్యే వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చల్లా లింగారెడ్డి తెలిపారు.