ఇంగ్లండ్‌, ఆఫ్ఘాన్ మధ్య కీలక పోరు.. ఓడిన జట్టు ఇంటికే

ఇంగ్లండ్‌, ఆఫ్ఘాన్ మధ్య కీలక పోరు.. ఓడిన జట్టు ఇంటికే

లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితిలో బుధవారం జరిగే గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనుంది. ఒకప్పుడు వైట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో మేటి జట్టుగా ఎదిగిన ఇంగ్లండ్ క్రమంగా దిగజారుతోంది. ఆస్ట్రేలియాతో తమ తొలి పోరులో 350 ప్లస్ స్కోరును కూడా కాపాడుకోలేక డీలా పడింది. బ్యాటర్లు ఆకట్టుకున్నా.. ఇంగ్లిష్ టీమ్ బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌తో పోరులో బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. 

అదే సమయంలో అఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. స్పిన్‌‌‌‌‌‌‌‌ త్రయం రషీద్ ఖాన్‌‌‌‌‌‌‌‌, నూర్ అహ్మద్‌‌‌‌‌‌‌‌, మొహమ్మద్ నబీని ఎదుర్కోవడం అంత సులువు కాదు. పైగా ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు స్లో బౌలర్ల ముందు తడబడుతున్నారు. గాయం కారణంగా ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ బ్రైడన్ కార్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీ నుంచి తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌‌‌‌‌‌‌‌తో ఇంగ్లిష్ టీమ్ స్పిన్ విభాగం బలోపేతం కానుంది. ఇక, తొలి పోరులో సౌతాఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓడిన అఫ్గానిస్తాన్‌ ఈ పోరులో బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేనకు ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి.