బైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

అయ్యప్ప పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టు అంగీకరించారన్నారు. ఉద్ధేశపూర్వకంగానే బైరి నరేష్ను కార్యక్రమానికి పిలిచినట్లు హనుమంతు ఒప్పుకున్నారని రిపోర్టులో ఉంది. నరేష్పై గతంలోనే పలు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. హనుమకొండలో రెండు కేసులు, నవాబ్పేట పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు తెలిపారు. 

రెండు రోజుల క్రితం నరేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు పరిగి సబ్ జైలుకు తరలించారు.  కాగా అయ్యప్పస్వామిపై బైరి నరేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్పస్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హిందువుల మనోభావాలను కించపరిచాడంటూ నరేష్‌ ను కొందరు అయ్యప్ప స్వాములు చితకబాదారు. ఇప్పటి వరకు 200 పోలీస్ స్టేషన్లలో నరేష్ పై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.