న్యూఢిల్లీ: ఆర్మీలో ఉమెన్ ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్ ను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీం ఆదేశాల మేరకు డిఫెన్స్ మినిస్ట్రీ ఈ ఆర్డర్ ఇచ్చింది. ఇకపై ఆర్మీలో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది. ఆర్మీలోని 10 విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్ఎస్సీ) ఉమెన్ ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్ మంజూరు చేస్తున్నట్లు ఆర్మీ ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్స్, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఆర్మీ సర్వీస్ కార్ప్స్, ఇంటెలిజెన్స్ కార్ప్స్ విభాగాల్లో పర్మినెంట్ కమిషన్ మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జడ్జి అడ్వొకేట్ జనరల్ (జేఏజీ), ఎడ్యుకేషన్ విభాగాల్లోనే ఉమెన్ ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్ ఉందన్నారు. అర్హులైన ఉమెన్ ఆఫీసర్లు అప్లై చేసుకుంటే, బోర్డు సెలక్షన్ప్ పక్రియను
స్టార్ట్ చేస్తుందన్నారు.
For More News..