హైదరాబాద్లో శిశువుల విక్రయ ముఠాలో కీలక నిందితురాలు అరెస్ట్

హైదరాబాద్లో శిశువుల విక్రయ ముఠాలో కీలక నిందితురాలు అరెస్ట్

దిల్ సుఖ్ నగర్, వెలుగు: శిశువుల విక్రయ ముఠాలో కీలక నిందితురాలిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం నవజాత శిశువులను విక్రయిస్తూ పట్టుబడ్డ ముఠా కేసును రాచకొండ పోలీసులు సవాల్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేసులో కీలక నిందితురాలిగా ఉన్న వందనాబెన్ (34)ను బుధవారం గుజరాత్ లో చైతన్యపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ముఠా నవజాత శిశువులను గుజరాత్‌‌‌‌‌‌‌‌ నుంచి  తీసుకొచ్చి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్టు చేశామని, కీలక నిందితురాలు వందనాబెన్​ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చైతన్య పురి ఎస్ఐ భద్రయ్య తెలిపారు. ఆమె  చెప్పే విషయాలు కేసులో కీలకం 
కానున్నాయన్నారు.