నాటోలో చేర్చుకుంటే.. గద్దె దిగేందుకు రెడీ: జెలెన్ స్కీ ప్రకటన

నాటోలో చేర్చుకుంటే.. గద్దె దిగేందుకు రెడీ: జెలెన్ స్కీ ప్రకటన

కీవ్: తమ దేశానికి నాటోలో సభ్యత్వం ఇస్తే.. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా వెంటనే రాజీనామా చేస్తానని ఆ దేశ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. కీవ్‎లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నా రాజీనామాతో ఉక్రెయిన్‎లో శాంతి నెలకొనే పరిస్థితి ఉంటే, అందుకు నేను రెడీ. ఇప్పటికిపుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా తప్పుకుంటా. 

అయితే.. నా దేశానికి నాటోలో సభ్యత్వం ఇవ్వాలి. అంతేకాకుండా.. రష్యా దాడుల నుంచి అమెరికా మాకు సెక్యూరిటీ కల్పించాలి. ఎందుకంటే, అమెరికా నుంచి ఈ గ్యారంటీలు అత్యవసరం. అలాగే, ఉక్రెయిన్‎కు ఆయన భాగస్వామిగా ఉండాలి. రష్యా, ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాలి” అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.