![కేజీబీవీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం](https://static.v6velugu.com/uploads/2023/06/KGBV-posts_1Cd2oGXapS.jpg)
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని కేజీబీవీలతో పాటు అర్బన్ రెసిడెన్షియల్(యూఆర్ఎస్) స్కూల్స్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నామని డీఈఓ సోమశేఖర శర్మ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్పెషల్ఆఫీసర్తో పాటు పీజీ సీఆర్టీ, సీఆర్టీ, పీఈటీల పోస్టులను తాత్కాలిక కాంట్రాక్ట్ పద్దతిన భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కేజీబీవీల్లో స్పెషల్ఆఫీసర్ పోస్టు, సీఆర్టీ –15, పీజీసీఆర్టీ –52 పోస్టులకు సబ్జెక్ట్ల వారీగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. కేజీబీవీల్లో మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అర్హులైనవారు 26వ తేదీ సాయంత్రం 5గంటలలోపు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలకు 8106651256నెంబర్లో సంప్రదించాలన్నారు.