వనపర్తి, వెలుగు: కేజీబీవీల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ నాన్ టీచింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఐఫ్టూ ఆఫీస్‌లో కేజీబీవీ వర్కర్ల సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో పని చేసే వర్కర్లకు అధిక వేతనాలిస్తూ, కేజీబీవీ వర్కర్లకు తక్కువ వేతనాలు ఇవ్వడం సరైంది కాదన్నారు.
కేజీబీవీ వర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.