కేజీఎఫ్ నటుడ్ని పెళ్లి చేసుకున్న నానీ హీరోయిన్

కేజీఎఫ్ నటుడ్ని పెళ్లి చేసుకున్న నానీ హీరోయిన్

కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా, పిల్ల జమీందార్ హీరోయిన్ హరిప్రియ పెళ్లి పీటలెక్కారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు.. ఇరు కుటుంబాలను ఒప్పించి ఒక్కటైయ్యారు. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య మీడియాకు దూరంగా ఈ జంట వివాహం జరిగినట్టు తెలుస్తోంది. వీరి వివాహం మైసూర్‌లో జరిగిందని సమాచారం. అయితే పెళ్లికి హాజరైన కన్నడ హీరో ధనంజయ వారి పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. దీంతో పెళ్లి విషయం బయటికొచ్చింది. వశిష్ఠ, హరిప్రియ జంట తమ పెళ్లి ఫొటోలను ఇప్పటివరకూ పోస్ట్ చేయలేదు.

ఇక ఈ జంట నటించిన సినిమాల విషయానికొస్తే.. కన్నడ నటుడై వశిష్ఠ సింహా ‘నారప్ప’ చిత్రంతో టాలీవుడ్ పరిచమై..‘నయీం డైరీస్‌’, ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రాల్లో నటించాడు. ‘కేజీయఫ్‌’లో ఒ కీలక పాత్రలో నటించడంతో ఆయన క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ‘పిల్ల జమీందార్‌’ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించిన హరిప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘తకిట తకిట’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘జైసింహా’ చిత్రాల్లోనూ నటించింది.