రజినికాంత్ సూపర్ హిట్ సీక్వెల్ సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్. నిజమేనా.. ?

రజినికాంత్ సూపర్ హిట్ సీక్వెల్ సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్. నిజమేనా.. ?

తమిళ్ ప్రముఖ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఫాధర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా రూ.750 కోట్లు(గ్రాస్) కలెక్షన్స్ సాధించింది. దీంతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమా సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడు. ఆ మధ్య ఓ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ లో జైలర్ 2 సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం క్యాస్ట్ & క్రూ పనులు జరుగుతున్నాయి. 

అయితే ఈ జైలర్ 2 సినిమాలో హీరోయిన్ రోల్ కోసం కన్నడ స్టార్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ని సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో జైలర్ 2 స్టోరీ విన్న శ్రీనిధి శెట్టి కూడా వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే శ్రీనిధి గతంలో కన్నడ ఇండస్ట్రీ హిట్ అయిన కేజీఎఫ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. దీంతో కన్నడతోపాటు తెలుగులో కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. అందుకే  శ్రీనిధి శెట్టి ని నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 లో సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ విషయం ఇలా ఉండగా కేజీఎఫ్ తర్వాత  శ్రీనిధి శెట్టి వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తన్న హిట్ 3: థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. మరో టాలీవుడ్ స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న "తెలుసు కదా" సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.