సిద్ధమవుతున్న సప్తముఖ మహాశక్తి గణపతి

  • పూర్తి కావొచ్చిన ఖైరతాబాద్ బడా వినాయకుడి విగ్రహం

హైదరాబాద్​,వెలుగు:  వినాయక చవితి ఉత్సవాలు వచ్చే నెల 7 నుంచి17 తేదీ వరకు జరగనున్నాయి. దీంతో సిటీలో గణేశ్​విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. ఖైరతాబాద్​బడా గణపతిని కూడా సిద్ధం చేస్తున్నారు.  దాదాపు విగ్రహ నిర్మాణం పూర్తికాగా.. త్వరలో రంగులతో తీర్చిదిద్దనున్నారు.

ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతి కొలువుదీరనుండగా.. తమిళనాడుకు చెందిన ప్రముఖ శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్​ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. మొత్తం 150 మంది కళాకారులు పనులు చేస్తున్నారు. 

ప్రత్యేక ఆకర్షణగా బాల రాముడు

ఈసారి బడా గణపతికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణ ప్రతిమలను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల అయోధ్యలో ప్రతిష్టించిన బాల రాముడిని , రాహువు, కేతువులను కూడా రూపొందిస్తున్నారు.