ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి రూపమిదే!

ఈ  ఏడాది ఖైరతాబాద్ గణపతి రూపమిదే!

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణపతి. భాగ్యనగర్ గణపతి నవరాత్రుల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే, ఈ విగ్నేశ్వరుడికి ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడి రూపానికి సంబంధించిన డిజైన్‌ను శనివారం ఉత్సవ్‌ కమిటీ ఆవిష్కరించింది. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య దర్శనమివ్వబోతున్నాడని తెలిపారు. ఈ విగ్రహం ఎత్తు 40 అడుగులు ఉండబోతోంది. విగ్రహానికి ముందు నందీశ్వరుడు, గరుఖ్మంతుడు ప్రార్థిస్తున్నట్టుగా కూర్చుని ఉంటారు. వారికి వెనుక ఒకవైపు సింహం, మరో వైపు గుర్రం ఉంటాయి. ఇక మహా గణపతి మంటపానికి ఒక వైపు కాళీ మాత రూపంలోని కృష్ణుడిని ఆరాధిస్తున్న రాధ, మరోవైపు నాగదేవత విగ్రహాలను కొలువుదీరుస్తారు. ఈ థీమ్‌లో ప్రత్యేకంగా గణపయ్య రూపాన్ని డిజైన్ చేసిన ఎస్. అన్బరాసన్ అని, విగ్రహం చేయబోయే శిల్పి సి.రాజేంద్రన్ అని ఉత్సవ కమిటీ తెలిపింది.