బడా గణపతికి లక్ష రుద్రాక్షల మాల..ఇయ్యాల్టి నుంచి 30 వేల లడ్డూలు పంపిణీ

బడా గణపతికి లక్ష రుద్రాక్షల మాల..ఇయ్యాల్టి నుంచి 30 వేల లడ్డూలు పంపిణీ
  • ఇయ్యాల్టి నుంచి 30 వేల లడ్డూలు పంపిణీ

ఖైరతాబాద్, వెలుగు : ఖైరతాబాద్​లోని శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహం వద్ద ఉత్సవ కమిటీ నిర్వాహకులు సోమవారం ఉదయం శివపార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం బడా గణపతికి లక్ష రుద్రాక్షలతో భారీ మాల వేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. వీక్​డే కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

జహీరాబాద్​ఎంపీ సురేశ్​​ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్​రెడ్డి, నీలం మధు​స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటివరకు రోజూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 25 వేల లడ్డూలు పంపిణీ చేయగా, మంగళవారం నుంచి ఆ సంఖ్యను 30 వేలకు పెంచనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.