ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. గంట గంటకు పెరుగుతున్న భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ రోజు ( సెప్టెంబర్ 15) ఆదివారం.. స్వామివారి దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రద్దీని అదుపుచేయలేక పోలీసులు, ఉత్సవ కమిటీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన రద్దీ కారణంగా మహిళలు..పిల్లలు.. వృద్దులు ఇబ్బందులు పడుతున్నారు.
ALSO READ| గణేష్ నిమజ్జనం రోజు మెట్రో సర్వీస్ టైం పొడిగింపు
ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే స్వామి దర్శనానికి అనుమతి ఇస్తారు. మంగళవారం ( సెప్టెంబర్ 17) నిమజ్జనం అయినప్పటికి .. రేపు ( సెప్టెంబర్ 16) నిమజ్జన ఏర్పాట్లు చేస్తారు. భారీ గణపతి నిమజ్జనం కోసం విజయవాడ నుండి తీసుకవచ్చిన టస్కర్ కొనసాగుతున్న వెల్డింగ్ పనులుకొనసాగుతున్నాయి. బడా గణేష్ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 17వ తేదీ శోభాయాత్ర అనంతరం.. హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జనం జరగనుంది.