- >>> ముగిసిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం
>>> మధ్యాహ్నం 2 గంటలకే పూర్తయిన మహా నిమజ్జన ఘట్టం
>>> బై బై గణేషా అంటూ మహా గణపతికి వీడ్కోలు పలికిన లక్షల మంది భక్తులు.
>>> మహాగణపతి నిమజ్జనం పూర్తవ్వటంతో.. ట్యాంక్ బండ్ పై మిగతా గణనాధుల సందడి, కోలాహలం
- భక్తుల నినాదాల మధ్య గణనాథుని నిమజ్జనం పూర్తైంది.
- మధ్యాహ్నం 1.40 కి 70 అడుగుల గణేశ్ ను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు.
- భక్తుల నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు హోరెత్తిపోయాయి.
- భారీ క్రేన్ బడా గణేశ్ ను గాల్లోకి ఎత్తి నిమజ్జనం చేసేందుకు సిద్దంగా పెట్టారు.
- నిమజ్జనానికి ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధంగా ఉన్నాడు.
- బడా గణేశ్ విగ్రహానికి క్రేన్ బెల్టులు కట్టారు.
- గణపతి బబ్పా మోరియా అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి.
- సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు హుస్సేన్ సాగర్ లో లాంచ్ నుంచి నిమజ్జనాన్ని వీక్షించనున్నారు.
- ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు పూజలు నిర్వహించారు.
- ఉత్సవ కమిటీ సభ్యులు హుస్సేన్ సాగర్ లో కలశపూజ చేశారు.
- గణనాథుని నిమజ్జనం చూడడానికి ఎన్టీఆర్ మార్గ్ రోడ్డుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
- ట్యాంక్ బండ్ రోడ్ మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది.
- టస్కర్ పై విగ్రహానికి ఉన్న వెల్డింగ్ లను తొలగిస్తున్నారు.
- క్రేన్ సిబ్బంది బెల్టులను విగ్రహానికి కడుతున్నారు.
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ అమ్రాపాలి సీఎం రేవంత్ రెడ్డితో పాటు శోభయాత్రలో పాల్గొన్నారు.
- నిమజ్జనం శోభాయాత్రలో పాల్గన్న సీఎం రేవంత్ రెడ్డి
- సీఎం రేవంత్ రెడ్డి క్రేన్ ఆపరేటర్ తో మట్లాడి నిమజ్జనం ఎలా చేస్తారని అడిగి తెలుసుకున్నారు.
- క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ మహా గణపతి
- నిమజ్జనానికి ముందు ఉత్తర పూజ నిర్వహించనున్నారు.
- ఖైరతాబాద్ గణేశుడి పక్కన ఉన్న శివపార్వతులు, శ్రీనివాస కళ్యాణ విగ్రహాల నిమజ్జనం
- మహా గణపతి పక్కన పెట్టిన శివపార్వతులు విగ్రహాలు క్రేన్ నెంబర్ 5 దగ్గర చేరుకున్నాయి. బడా గణేశ్ తప్ప మిగిలిన విగ్రహాలు ఇక్కడే నిమజ్జనం చేయనున్నారు.
- శ్రీనివాస కళ్యాణ విగ్రహాలు ముందుగా నిమజ్జనం చేస్తున్న అధికారులు.
- ఖైరతాబాద్ గణేశ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం చేయనున్నారు.
- మరి కొద్ది నిమిషాల్లో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోనున్న ఖైరతాబాద్ మహా గణపతి
- ఎన్టీఆర్ మార్గంలోని ట్యాంక్ బండ్ దగ్గరకి చేరుకున్న ఖైరతాబాద్ గణేశుడు.
- మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య బడా గణేశ్ నిమజ్జనం కానున్నాడు.
- తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఖైరతాబాద్ మహా గణపతికి స్వాగతం పలికిన భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు
- మరి కొన్ని గంటల్లో ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జమం జరగనుంది.
- ఎన్టీఆర్ మార్గ్ లో ట్యాంక్ బండ్ పై నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్.
- GHMC మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కమిషనర్ అమ్రాపాలి నిమజ్జనం ఏర్పాటు దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
- ఎన్టీఆర్ మార్గ్ వైపు తిరిగి.. సచివాలయం ముందుకు వచ్చిన ఖైరతాబాద్ గణేశ్ టస్కర్.
- గణేశ్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
- ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్, భత్రతా సిబ్బంది ఏర్పాటు చూస్తున్నారు.
- 10గంటల 40 నిమిషాలకు BSNL ఆఫిస్ నుంచి తెలుగు తల్లి ఫై ఓవర్ వైపు కదిలిన ఖైరతాబాద్ మహా గణపతి.
- తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింది రూట్ వైపు వెళ్తున్న శోభయాత్ర వాహనం.
- టెలిఫోన్ భవన్ సర్కిల్ వద్దకు చేరుకున్న గణపతి.
- సెక్రటేరియట్ బ్యాంక్ గేట్ రోడ్డు వరకు ఖైరతాబాద్ మహారాజా చేరుకున్నారు.
- బిగ్ బ్రేకింగ్ : ట్యాంక్ బండ్ గణేశ్ నిమజ్జనంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఇప్పుడిప్పుడే వేలాదిగా.. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు కదలివస్తున్న గణేష్ భక్తులు.. జై జై గణేషా నినాదాలతో హోరెత్తుతున్న ట్యాంక్ బండ్ పరిసరాలు
- ఎన్టీఆర్ మార్గ్ లో భక్తుల జన సందోహం
- మహా గణపతి నిమజ్జనం కోసం సూపర్ క్రేన్.. 350 టన్నుల బరువు మోయగల సామర్థ్యం ఉన్న క్రేన్.. NTR మార్గ్ లో ఇప్పటికే భారీ క్రేన్ సిద్ధం.
- 9 గంటల 5 నిమిషాలకు టెలిఫోన్ భవన్ సర్కిల్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ పెద్ద గణపయ్య.
- తెలుగుతల్లి ఫ్లైఓవర్ ( మెయిన్ రోడ్డు)వైపుకు తిరిగిన బడా గణపతి శోభాయాత్ర వాహనం.
- టెలిఫోన్ భవన్ చౌరస్తా రోడ్డు దగ్గరకు చేరుకుంటున్న ఖైరతాబాద్ గణేష్ మహారాజ్.
- ఉదయం 8.44 నిమిషాలకు సెన్సేషన్ థియేటర్ గల్లి నుంచి BSNL ఆఫీస్ దగ్గరున్న మెయిన్ రోడ్డుకు చేరుకున్న ఖైరతాబాద్ మహా గణపతి శోభా యాత్ర.
- 56 సీసీటీవీ కెమెరాలుతో పూర్తి నిఘూ ఏర్పాటు చేశారు.
- ఖైరతాబాద్ భారీ విగ్రహం నిమజ్జనం మార్గంలో 700 మంది పోలీసులు బందోబస్తుగా ఉన్నారు.
- సెన్సేషన్ థియేటర్ ముందుకు కదులుతున్న ఖైరతాబాద్ బడా గణనాథుడు. థియేటర్ దగ్గర రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది.
- ఉదయం 7.30 నిమిషాలకు వడివడిగా బడా గణేష్ టెలిఫోన్ భవన్ దగ్గరకు చేరుకున్నాడు.
- శోభాయాత్ర టస్కర్ ముందు భక్తులు ఎక్కువగా జమ అవకుండా రెండు అంచెల్లో రోప్ పార్టీ ఏర్పాటు చేసిన పోలీసులు.
- పోలీసులు ఖైరతాబాద్ పుర వీధులవైపు భక్తులను అనుమతించడం లేదు.
- సెన్సేషన్ థియేటర్ వద్దే బారికేడ్లను ఏర్పాటు చేశారు.
- శోభాయాత్ర వాహనం ముందు పెద్ద సంఖ్యలో చేరుకుంటే గల్లీ రోడ్ దాటేందుకే ఆలస్యం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.
-
ఇప్పటికే మండపం నుండి హెల్త్ సెంటర్ వరకు కదిలిన భారీ గణపతి వాహనం.
-
మహా గణపతి శోభ యాత్రను పోలీసులు త్వరగా నిర్వహిస్తోన్నారు.
-
టస్కర్ పైకి బడా గణపతిని ఎక్కించిన క్రేన్ వైర్లను తొలగించారు. టస్కర్ పైని వెల్డింగ్ పనులు పూర్తైయ్యాయి. శోభ యాత్ర రథం ఉదయం 6.40కు ముందుకు కదిలింది.
-
గణనాథుని దగ్గరకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చి పూజలు నిర్వహించారు.
-
ప్రారంభమైన ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం..
-
హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన వినాయక నిమజ్జనం. బ్యాండ్ బాజా నడుమ వైభవంగా శోభ యాత్ర కొనసాగుతోంది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర ఆటపాటలతో భక్తుల సందడి నెలకొంది. గంగమ్మ ఒడికి గణనాధులను తరలిస్తున్న భక్తజనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన GHMC అధికారులు. నిమజ్జనం బందోబస్తుకు 25 వేల మంది పోలీసులు డ్యూటీ చేస్తున్నారు.