ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

 ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసే సమయం దగ్గర పడటంతో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొనేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో గణనాథుడిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటి తెలిపింది.  ఈ రోజు  ( సెప్టె్ంబర్ 14) న  దాదాపు నాలుగు లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. రేపు ( సెప్టెంబర్ 15)  రాత్రి 12 గంటల వరకు మాత్రమే స్వామిదర్శనానికి అనుమతి ఇస్తామన్నారు,  తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారని ఉత్సవ కమిటి సభ్యులు తెలిపారు. రేపు  ( సెప్టెంబర్ 15) సాయంత్రం బడా గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి  పంచిపెడతామని  ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం తెలిపింది. ఎల్లుండి( సెప్టెంబర్ 16) ఉదయం భక్తులను  దర్శనానికి అనుమతించమని   ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ తెలిపారు.  మంగళవారం ( సెప్టెంబర్ 16)  ఉదయం 6 గంటలకు మహాగణపతి శోభాయాత్రను  ప్రారంభిస్తామని తెలిపారు. 

ALSO READ | ఖైరతాబాద్: బడా గణపతి దర్శనం కోసం భారీగా భక్తులు.. సెల్ పోన్ లు పోయాయని ఆందోళన