ఖైరతాబాద్, వెలుగు: ఖైరతాబాద్మహాగణపతి భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నాడు. ఖైరతాబాద్‌లో ఉత్సవాలు మొదలై 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం 70 హోమ గుండాలు ఏర్పాటు చేసి శ్రీలక్ష్మీగణపతి రుద్రహోమం నిర్వహించారు. 280 జంటలు, పీసీసీ ప్రధాన కార్యదర్శి విజయారెడ్డి, ఉత్యవ కమిటీ సభ్యురాలు వీణా మాధురి పాల్గొన్నారు.
విగ్రహం ముందు కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇన్ కమ్ట్యాక్స్చీఫ్కమిషనర్ మిథాలీ మధుస్మిత స్వామివారిని దర్శించుకున్నారు.