ఫార్ములా ఈ– కార్​ రేస్ తో సిటీ ఇమేజ్ ​పెరిగింది.. అవినీతీ జరిగింది : ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఫార్ములా ఈ– కార్ రేసుతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని.. అయితే అవినీతి కూడా జరిగిందని ఖైరతాబాద్​ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తాను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతోందన్నారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను కేటీఆర్ పై మాట్లాడాను అంటున్నారు. నేనేం కేటీఆర్ కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలే. రేస్ పెట్టినప్పుడు కేటీఆర్ నా సలహా తీసుకున్నారు.

అప్పుడు నా ఒపీనియన్ మాత్రమే చెప్పా’ అని దానం అన్నారు. బీజేపీ లీడర్లు మూసీ నిద్ర చేయడానికి ముందు వెళ్లే ప్లేసుల్లో ఏసీలు పెట్టించుకున్నారని, బీదవారి ఇండ్లల్లో చేసిన జొన్న రొట్టెలు తినకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బయటి నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నాడని విమర్శించారు. తాను ఫైటర్​నని, ఉప ఎన్నికకు భయపడబోనన్నారు. హైడ్రాపై తన వాఖ్యలు ఇప్పుడు కూడా మారలేదని, ప్రభుత్వం హైడ్రాపై పునరాలోచన చేయాలని కోరారు.