ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఉత్సవాలు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో గంట గంటకు పెరుగుతున్న భక్తుల రద్దీ పెరుగుతుంది. దర్శనానికి వచ్చే భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రతి లైన్ లో భక్తులు బారులు తీరారు. అధిక సంఖ్యలో భక్తుల తాకిడితో జనాలు విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదులు వస్తున్నారు. ఇప్పటికే అనేకమంది సెల్ ఫోన్ పోగుట్టుకున్నారని తెలుస్తోంది. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. దొంగలు సంచరిస్తున్నారని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ | మహా నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్త్..