జగన్ ఇల్లు ఆక్రమణలు కూల్చివేతలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌‌‌‌పై వేటు

హైదరాబాద్, వెలుగు: ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం లోటస్ పాండ్ ముందు అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలిచ్చిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై వేటు పడింది. హేమంత్​ను ట్రాన్స్​ఫర్ చేస్తూ జీహెచ్ఎంసీ ఇన్​చార్జ్ కమిషనర్ అమ్రపాలి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఆయన్ను ఖైరతాబాద్ కమిషనర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ.. జీఏడీకి రిపోర్ట్ చేయాలని సూచించారు. 

ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు కూల్చివేతలకు హేమంత్ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నది. అందుకే ఆయనపై బదిలీ వేటు వేసినట్టు సమాచారం.