జైశంకర్ లండన్ పర్యటనలో ఉద్రిక్తత.. మన జెండాను చింపేసి రెచ్చిపోయిన ఖలిస్తానీ వేర్పాటువాదులు

జైశంకర్ లండన్ పర్యటనలో ఉద్రిక్తత.. మన జెండాను చింపేసి రెచ్చిపోయిన ఖలిస్తానీ వేర్పాటువాదులు

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. ఆయనపై దాడికి యత్నించిన ఖలిస్తానీ వేర్పాటువాదులు భారత పతాకాన్ని చింపేసి వీరంగం సృష్టించారు. జైశంకర్ పర్యటనను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన ఖలిస్తానీలు  భారత పతాకాన్ని చింపేసి భద్రతా ఉల్లంఘన పాల్పడ్డారు. ఓ సమావేశం ముగించుకున్న జైశంకర్ ఛతం హౌస్ నుండి బయలుదేరిన సమయంలో ఓ వ్యక్తి ఆయన కాన్వాయ్ కి అడ్డుపడి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారత పతాకాన్ని చింపేసి వీరంగం సృష్టించాడు.

ఈ క్రమంలో ఘటనాస్థలి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.. కాసేపటికి పోలీసులు ఎంటర్ అయ్యి నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. జైశంకర్ ఛత్తం హౌస్ సమావేశంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఖలిస్తానీ వేర్పాటువాదులు. 

చెవెనింగ్ హౌస్‌లో UK విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో విస్తృత చర్చలు జరిపారు జైశంకర్.. వ్యూహాత్మక సమన్వయం, రాజకీయ సహకారం, వాణిజ్య చర్చలు, విద్య, సాంకేతికత, మొబిలిటీ, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజి వంటి ద్వైపాక్షిక అంశాలు ఈ సమావేశంలో చర్చినట్లు తెలుస్తోంది. 

ALSO READ : బంధీలను విడుదల చేయకుంటే మీరు చచ్చినట్లే.. హమాస్కు ట్రంప్ అల్టిమేటమ్

చాథమ్ హౌస్‌లో జరిగిన సమావేశంలో పాకిస్తాన్‌తో కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి శాంతిని నెలకొల్పాలన్న ట్రంప్ చర్యలను ప్రధాని మోడీ ఉపయోగించుకోగలరా అన్న అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. భారత విదేశాంగ విధానంలో థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని.. ఆర్టికల్ 370 రద్దు, ఈ ప్రాంతంలో ఎన్నికల తర్వాత పరిస్థితి వంటి అంశాల్లో థర్డ్ పార్టీ జోక్యాన్ని ఖండించారు జైశంకర్.