ఖలిస్తానీ టెర్రరిస్టు అర్ష్ దల్లాకు బెయిల్

ఖలిస్తానీ టెర్రరిస్టు అర్ష్ దల్లాకు బెయిల్

ఒట్టావా: ఖలిస్తానీ టెర్రరిస్టు, నిషేధిత ఖలిస్తాన్ టైగర్  ఫోర్స్  తాత్కాలిక చీఫ్​అర్ష్ దీప్  సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దల్లాకు కెనడా కోర్టు బెయిల్  మంజూరు చేసింది. 30 వేల అమెరికన్  డాలర్ల (రూ.25 లక్షలు) పూచీకత్తుపై అతడికి బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది. ఈ ఏడాది అక్టోబరులో కెనడాలోని హాల్టన్‎లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో దల్లా గాయపడ్డాడు. తర్వాత అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి దల్లాను తమకు అప్పగించాలని కెనడాను భారత ప్రభుత్వం కోరుతోంది. ఇలాంటి సమయంలో దల్లాకు కెనడా కోర్టు బెయిల్  మంజూరు చేసింది.