
ఖమ్మం రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే రీతిలో మారిపోయాయి. బీఆర్ఎస్కు నుంచి బయటకి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడం.. తరువాత బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్‌పై విమర్శలు చేయడం జిల్లా రాజకీయాల్ని వేడెక్కిస్తోంది.
ఇదే క్రమంలో పొంగులేటి అనుచరుడు ఒకరు పువ్వాడ అనుచరులు తనను వేధిస్తున్నారని చెబుతూ ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసుకోవడం.. అది వైరల్కావడంతో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.
శ్రీనివాస్ రెడ్డి అనుచరులు పొంగులేటి అభిమానులపై దాడి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మంత్రి అనుచరుడైన బోయపాటి వాసు తనను వేధిస్తున్నాడని, కొట్టాడని ఎస్కే భాష ఆవేదన వ్యక్తం చేశాడు.
వాసు తప్పు చేసింది కాక.. తనపై రివర్స్ కేసు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనని చిత్ర హింసలు పెడుతున్నాడని తనకు బతకాలని లేదని, కుటుంబం జాగ్రత్త అంటున్న మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నాడు. సోషల్‌మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ తో వచ్చిన వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.