జనవరి చివరి వారంలోగా సీఎంఆర్​ అందించాలి : డి.మధుసూదన్ నాయక్

జనవరి చివరి వారంలోగా సీఎంఆర్​ అందించాలి : డి.మధుసూదన్ నాయక్
  •     అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్

ఖమ్మం రూరల్, వెలుగు: నెలాఖరులోగా సీఎంఆర్ టార్గెట్​ కంప్లీట్ ​చేయాలని ఖమ్మం అడిషనల్​కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ ఆదేశించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, నేలకొండపల్లి మండలం రాయగూడెం, ముదిగొండ మండలం అమ్మపేట, కొణిజర్లలోని రైస్​మిల్లులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మిల్లులకు కేటాయించిన, ఇప్పటివరకు ప్రభుత్వానికి అందించిన సీఎంఆర్​లెక్కలపై ఆరా తీశారు.

పెండింగ్​ బియ్యాన్ని త్వరగా అప్పగించాలని మిల్లర్లకు సూచించారు. ఈ నెల 31తో గడువు ముగుస్తుందని, ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. టార్గెట్​పూర్తిచేయని మిల్లులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.