
ఖమ్మం టౌన్, వెలుగు : 2023–24 సంవత్సరం ఖరీఫ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యం సీఎంఆర్ నిబంధనల మేరకు ఎఫ్సీఐకి బియ్యం అందించాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం న్యూ కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, ఎఫ్సీఐ అధికారులతో సీఎంఆర్ రైస్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎంఆర్ బియ్యం తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించారు. రైస్ మిల్లర్లకు ఇవ్వాల్సిన గోనె సంచులు, ఎఫ్సీఐ వారి వద్ద బియ్యం దిగుమతి కోసం సరిపడు స్థలం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరుకు రైస్ మిల్లర్లందరూ ఇవ్వాల్సిన బియ్యం ఎఫ్సీఐకి అప్పగించాలని ఆదేశించారు.