కేజీబీవీల్లో సదుపాయాల కల్పనకు చర్యలు : మధుసూదన్ నాయక్

కేజీబీవీల్లో సదుపాయాల కల్పనకు చర్యలు : మధుసూదన్ నాయక్
  • ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్ నాయక్

ఖమ్మం టౌన్/మదిగొండ, వెలుగు :  జిల్లాలోని కేజీబీవీల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. మంగళవారం ముదిగొండ మండలంలోని న్యూ లక్ష్మీపురం కేజీబీవీని ఆయన సందర్శించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్స్​కు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం ఖమ్మం కలెక్టరేట్ లో పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీ పై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సీఎంఆర్ రైస్ డెలివరీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాకు నిర్దేశించిన రైస్ డెలివరీ ఇన్​టైంలో పూర్తి చేయాలని ఆదేశించారు. యాసంగి సీజన్ కు సంబంధించి రైస్ డెలివరీ లక్ష్యాలను సైతం సకాలంలో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు రాజేశ్వర రావు, అధికారులు, రైస్ మిల్లర్లు, తదితరులు  పాల్గొన్నారు.