అశ్వాపురం, వెలుగు : ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్ గురువారం అశ్వాపురం మండలంలో పర్యటించారు. ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న మురుగు గుంతలను పరిశీలించారు. గంబుషా చేపలను ఆ గుంటలో వదిలి ఆయిల్ బాల్స్ కూడా వేశారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈనెల 5 నుంచి 9 వరకు జరుగుతున్న స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. పీహెచ్సీలో రోగుల సంఖ్య, ప్రతినెలా జరుగుతున్న కాన్పుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో గంట వరప్రసాద్, ఎంపీవో భూక్య శ్రీనివాస్, డీటీ రషీద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంకీర్తన, ఆర్ఐ రాజేశ్వరరావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.