- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్
- హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీ
ఖమ్మం టౌన్, వెలుగు : కస్టమర్లకు క్వాలిటీ ఫుడ్ అందించాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ సూచించారు. బుధవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కిరణ్ కుమార్ తో కలిసి నగరంలోని వైరా రోడ్ లోపలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాడే ప్రతీ ప్యాక్ కు తయారీ, కాలపరిమితి వివరాలు ఉండాలన్నారు.
కిచెన్ లో పనిచేసే వారందరు శుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు. రుచి కోసం హానికర రసాయనాలు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనవెంట ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్ స్వామి, ఆర్ఐలు రమేశ్, రవి, అధికారులు ఉన్నారు.