సరికొత్తగా వెడ్డింగ్ ఇన్విటేషన్

సరికొత్తగా వెడ్డింగ్ ఇన్విటేషన్

జనాలు రోజురోజుకు అప్ డేట్ అవుతున్నారు.ఎవరికి వారు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏదైనా పనిని కొత్తగా... క్రియేటివిటీగా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఓ కాబోయే జంట తమ పెళ్లి కార్డు విషయంలో కూడా సరికొత్తగా ఆలోచించింది. మామూలుగా పెళ్లికార్డు అంటే.. వధువు, వరుడు ఫోటోలు, పేర్లు... వారి తల్లిదండ్రులు బంధువుల పేర్లతో పాటు.. పెళ్లి ముహుర్తం,తేదీ,  కళ్యాణ వేదిక.. భోజనం ఇలా అనేక రకాల సమాచారంతో రూపొందిస్తారు. అయితే తాజాగా ఓ జంట మాత్రం శుభలేఖ విషయంలో సరికొత్తగా ఆలోచించింది. తమ వివాహ వేడుకకు వెరైటీగా ఆహ్వానిస్తోంది. 

కొత్తగా సరికొత్తగా వెడ్డింగ్ ఇన్విటేషన్ ను రూపొందించిన ఖమ్మం అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో  ట్రెండింగ్‌గా అయ్యారు. తన వివాహానికి కంటే ముందు తనకు కాబోయే శ్రీమతి తో జరిగిన ఘట్టాలను త్రీడిలో , తన కవిత్వంతో తన గొంతునే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ గా ఉపయోగించి సరికొత్తగా తయారు చేశారు. పెళ్లి కార్డు ఇస్తే కేవలం పెళ్లి అని మాత్రమే తెలుస్తుంది. కానీ వీడియో ద్వారా తమ పెళ్లి ఎలా కుదిరింది వారి మధ్య పెనవేసుకున్న బంధం గురించి ఆయన వివరించారు. దీంతో ఇప్పుడు ఈ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. 

ఇవి కూడా చదవండి:

రాహుల్ ఇంటికి త్రిపుర మాజీ ఎమ్మెల్యేలు

పిల్లోతో పింపుల్స్?