
భద్రాచలం, వెలుగు : పాపికొండల పర్యాటకులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా సందర్భంగా శనివారం నుంచి పాపికొండల్లో లాంచీ విహారానికి అల్లూరి జిల్లా చింతూరు ఐటీడీఏ పీవో ఓకే చెప్పారు. గోదావరి వరదల కారణంగా పాపికొండల టూరిజంను ఐదు నెలల పాటు నిలిపివేశారు. వరదలు తగ్గడంతో పర్మిషన్ కోసం లాంచీ యజమానులు ఆఫీసర్లను సంప్రదించారు. దసరా సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవల ఎక్కువ మంది టూరిస్ట్‌లు భద్రాచలం వచ్చారు. పాపికొండల్లో విహరించేందుకు ఉత్సాహం చూపినా పర్మిషన్ లేకపోవడంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. ఇరిగేషన్ ఇంజినీర్లు లాంచీలను తనిఖీ చేసి, సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. సెలవులు, టూరిస్టుల రద్దీ డిమాండ్ దృష్ట్యా స్పందించిన ఆఫీసర్లు ఎట్టకేలకు పాపికొండల టూర్‌కు పర్మిషన్ ఇచ్చారు.