ఖమ్మం నగరంలోని పలు ప్రధాన సెంటర్లలో ఒకప్పుడు గోడలననీ పోస్టర్లతో.. పెయింట్ రాలిపోయి అందవికారంగా కనిపించేవి. కానీ ఇప్పుడు జిగేల్మనిపించే కలర్స్‌తో.. సందేశమేచ్చే అందమైన బొమ్మలతో చూడముచ్చటగా దర్శనమిస్తున్నాయి. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆలోచనతో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యవేక్షణలో గోడలన్నింటిపై సందేశాత్మక, మహాత్ముల చిత్రాలతో కూడిన వాల్ పెయింటింగ్స్ ఇప్పుడు ఖమ్మం ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఆర్టిస్టులుగా తమ ఉనికిని కోల్పోతున్న సమయంలో కలెక్టర్ తమకు జీవనోపాధి కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందమైన బొమ్మలను గీయడంలో నిమగ్నమైన ఆర్టిస్టులను, వారు వేసిన పెయింటింగ్స్‌ను ఆదివారం ‘వెలుగు’ క్లిక్‌మనిపించింది. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం