
- ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో మూతబడిన రెండు బార్లకు లాటరీ ద్వారా లైసెన్స్దారులను ఎంపిక చేసినట్లు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ఈ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూతబడిన రెండు బార్లకు 112 మంది నుంచి 145 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిన బార్ల లైసెన్స్ దారుల ఎంపిక చేశామని చెప్పారు. జుట్టుకొండ లక్ష్మీ నారాయణ, గుండవరం రాజేవ్వరరావు బార్ల లైసెన్సులు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి. జనార్థన్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై. వేణుగోపాల్ రెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.