ఖమ్మం జిల్లాలో టెన్త్​ ఎగ్జామ్​సెంటర్​ను తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం జిల్లాలో టెన్త్​ ఎగ్జామ్​సెంటర్​ను తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం రిక్కా బజార్  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా సెంటర్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ కె. శేఖర్ రావు, డిపార్ట్​మెంట్ అధికారి ఎన్. శ్రీనివాసచారీ, సిట్టింగ్ స్క్వాడ్ సురేందర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎంపీహెచ్ఏ (ఎం) సీహెచ్. శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాగా, బుధవారం జిల్లాలో 16,417 మంది విద్యార్థులకు గాను 16,388 మంది పరీక్షకు హాజరయ్యారు. 

అశ్వారావుపేట : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ డి వేణుగోపాల్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ తో పాటు ఎంఈఓ ప్రసాదరావు ఉన్నారు. అనంతరం మండలంలోని చిలకల గండి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.