ఎండిన పంటలను పరిశీలించిన కలెక్టర్

ఎండిన పంటలను పరిశీలించిన కలెక్టర్

కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలం మల్లాయిగూడెం, జుజ్జల్​రావుపేలో ఎండిపోయిన వరి పంటలను మంగళవారం ఖమ్మం కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్​లోనూ వరదలు వచ్చి, కాల్వలు తెగి పంటలు ఎండిపోయేప్రమాదం ఉందన్నారు. 

ఈ పరిస్థితుల్లో పంటలు ఎండకుండా ఉండేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు ప్రభుత్వం తరుఫున బోర్లు వేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కలెక్టర్​ వెంట డీఏవో పుల్లయ్య, ఏడీఏ సరిత, ఏవో వాణి, రైతులు బదావత్ నరేశ్​​ముత్తయ్య, వీరయ్య, రామారావు ఉన్నారు.