- ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో కలెక్టర్, అడిషనల్కలెక్టర్ శ్రీజతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పలు సమస్యలపై టోటల్ గా 60 వినతులు ప్రజావాణికి అందాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, డీఆర్వో ఎం.రాజేశ్వరి, కలెక్టరేట్ ఏఓ అరుణ, జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బాల సదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..
బాల సదనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, దీనికి సంబంధించిన పనులను పకడ్బందీగా అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కలెక్టర్ నగరంలోని బాల సదనం భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల సదనంలో చేపట్టాల్సిన మరమ్మతులు, పిల్లలకు ఆహ్లాదం కోసం కల్పించాల్సిన ఆట పరికరాల పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి, బాల సదనం సూపరింటెండెంట్ వరలక్ష్మి, సంబంధిత అధికారులు, తదితరులున్నారు.