ఖమ్మం టౌన్, వెలుగు : ఇంజినీరింగ్ శాఖలు తమ పరిధిలోఎన్ని ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి, ఎన్ని కూల్చివేశారు, ఎన్ని రిపేర్లతో ఉపయోగంలోకి తేచ్చారు.. లాంటి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ కోరారు. లైబ్రరీ బిల్డింగ్ కూలిన సంఘటన పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం న్యూ కలె శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ భవనాలను ఆయా ఇంజినీరింగ్ శాఖల అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు.
రిమార్కులను రిజిస్టర్ లో పొందుపర్చాలని చెప్పారు. కూల్చివేతకు ఆర్థికభారం పడకుండా చూడాలన్నారు. కొత్త భవన నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్యామ్ ప్రసాద్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, పీఆర్, గిరిజన, విద్యా శాఖ ఈఈలు పాండురంగ విఠల్, నాగశేషు, తానాజీ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి
జిల్లా పశు సంవర్థక అధికారి వేణు మనోహర్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి జయప్రకాశ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జ్యోతి, కలెక్టరేట్ ఏవో అరుణ, షెడ్యూల్ సంక్షేమ శాఖ ఆర్సీఓ ప్రత్యూష పాల్గొన్నారు.
ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి
అధికారులు శిక్షణ ను సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ సూచించారు. శుక్రవారం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దృష్ట్యా తహసీల్దార్లు, సెక్టార్ అధికారులకు, ఎన్నికల విధులు, డిస్ట్రిబ్యూషన్, రిషిప్షన్ కేంద్రాల నిర్వహణపై అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అధికారులు పోలింగ్
పోలింగ్ యంత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. పోలింగ్ తర్వాత ఈవీఎంల రవాణా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మాత్రమే చేపట్టాలన్నారు.
టీఎస్ బీ పాస్ విధానం ద్వారా..
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కొత్త నిర్మాణాలకు బిపాస్ ద్వారా అనుమతులు ఇస్తామని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఖమ్మం, మధిర, సత్తుపల్లి , సుడా పరిధిలో మొత్తం 21 దరఖాస్తులను పరిశీలించారు.
నిబంధనల మేరకు సమర్పించిన దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. కలెక్టర్ మాట్లాడుతూ లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయి స్థల పరిశీలన చేసి 21 రోజుల లోపు అనుమతులను జారీచేయాలని తెలిపారు.