అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్​ వీపీ గౌతమ్

ఖమ్మం, వెలుగు : అభివృద్ధి పనులు ఆలస్యంగా జరుగుతుండడంపై ఖమ్మం కలెక్టర్​ వీపీ గౌతమ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను స్పీడప్​ చేసి త్వరగా కంప్లీట్​చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. బౌద్ధ స్థూపం వద్ద రూ. కోటితో నిర్మిస్తున్న విడిది కేంద్రం, శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరం వద్ద రూ. 2 కోట్లతో నిర్మిస్తున్న ఆడిటోరియం పనులను తనిఖీ చేశారు. విడిది కేంద్రం వద్ద పనులు పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పనులకు సామగ్రి రావాలని

ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సోషల్​ మీడియాలో పోస్ట్ చేయాలని ఆదేశించారు. రెండు నెలల్లోగా నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఆడిటోరియం పనులు వచ్చేనెల 5లోపు కంప్లీట్​ చేయాలని ఆదేశించారు. కలెక్టర్​ వెంట ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్యామ్ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, ఎంపీడీవో జమునారెడ్డి, తహసీల్దార్ అనురాధబాయి, టూరిజం ఏఈఈ మహ్మద్ నాజిష్, సర్పంచ్ నవీన్​ ఉన్నారు. 

మెరుగైన వైద్యం అందించాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, మెరుగైన సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచాలని డాక్టర్లకు కలెక్టర్ సూచించారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీలను, వైద్యాధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు.

వైద్యుల పేర్లతో బోర్డులు ప్రదర్శించాలన్నారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాట్లు జరుగుతున్నాయని, నెల రోజుల్లో ఆపరేషన్లు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డాక్టర్లు మంగళ, రాజశేఖర్, రాజేశ్, శ్రావణ్​ ఉన్నారు.

రైతులను మోసం చేస్తే చర్యలు 

ఖమ్మం టౌన్ :  మిర్చి కొనుగోలు విషయమై రైతులను ట్రేడర్లు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గౌతమ్​ హెచ్చరించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను శుక్రవారం ఆయన సందర్శించారు.  మిర్చి కొనుగోళ్లను తనిఖీ చేశారు. రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత మేరకు ధర రావడం లేదని ఆరోపణలు వస్తున్నట్లు చెప్పారు. జెండా పాట రూ.20 వేలు ఉండగా శుక్రవారం రూ.20,500కు ధర పలికిందన్నారు.

కలెక్టర్​ వెంట అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలీం, పీడీ ఎంఐపీ రమణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బజారు, అధికారులు తదితరులు ఉన్నారు.