ఖమ్మం టౌన్, వెలుగు : దివ్యాంగులకు చేయూతనిస్తున్న ఖమ్మం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శనివారం డీఎన్ఎఫ్ సంస్థ కార్యాలయం, గణేశ్బోనాల నిలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ 25 మంది దివ్యాంగులకు రూ.3 లక్షల విలువైన వీల్ చైర్లు, ఎస్సీబీఐటీలో బీటెక్ చదువుతున్న ఒక పేద విద్యార్థినికి రూ.50 వేల విలువైన లాప్ టాప్ ను అందజేశారు.
ఎన్నారై ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బయ్యన బాబురావు, అధ్యక్ష, కార్యదర్శులు బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, ఫౌండేషన్ బాధ్యులు మిక్కిలినేని నరేంద్ర చౌదరి, కోశాధికారి పసుమర్తి రంగారావు, కొంగర పురుషోత్తమరావు, కురివెళ్ల ప్రవీణ్, అన్నం శ్రీనివాసరావు, వాసిరెడ్డి శ్రీనివాస్, కళ్యాణపు సాంబశివరావు, అంబేద్కర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి, పద్మిని, వాసిరెడ్డి అర్జునరావు, ముదాలగర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.