ఖమ్మం, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. ఆదివారం జిల్లా ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మాతా శిశు సంరక్షణ వార్డులలో పేషెంట్లకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. బాలింతలతో మాట్లాడి వైద్య సేవలను గురించి తెలుసుకున్నారు.
పేషెంట్లకు పెట్టే భోజనం ఎలా ఉన్నది అడిగి తెలుసుకున్నారు. రోగుల సహాయకులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు. ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.