ఖమ్మం టౌన్, వెలుగు : చిరు వ్యాపారుల పొట్టకొట్టే అరాచక శక్తులను తరిమికొట్టాలని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సిటీలోని డీఆర్డీఏ సమీపంలో ఉన్న వెజ్ టేబుల్ హోల్సేల్ వ్యాపారులను, రైతులను, హమాలీలను తుమ్మల కలిసి ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పాలనలో పండ్ల మార్కెట్ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం జిల్లా పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన మౌలానా ఆజాద్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.57వ డివిజన్ లో కార్పొరేటర్ రషీదా బేగం ముస్తఫా ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి ప్రచారంలో తుమ్మల తనయుడు యుగంధర్ పాల్గొని కాంగ్రెస్ భవిష్యత్తులు చేపట్టబోయే పనులను ఇవరించారు. సిటీలోని 37, 38 వ డివిజన్ ఖిల్లాలో ప్రచార ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్లోకి మాజీ ఎంపీపీ
భద్రాచలం : బీఆర్ఎస్ పార్టీకి చెందిన భద్రాచలం మాజీ ఎంపీపీ ఊకె శాంతమ్మ, పార్టీ మాజీ మహిళా మండల అధ్యక్షురాలు ఎండీ ముంతాజ్, గ్రంథాలయం డైరక్టర్ జెంజం దేవీలు శనివారం తుమ్మల, బాలసాని ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. భద్రాచలం అభివృద్ధి కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని వారు తెలిపారు.