పన్ను చెల్లించని ఇంటికి రెడ్ నోటీస్ ఇవ్వాలి : ఆదర్శ్ సురభి

  •     కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి

ఖమ్మం టౌన్, వెలుగు : పన్ను చెల్లించని ఇంటికి రెడ్ నోటీస్ ఇవ్వాలని బిల్ కలెక్టర్లకు ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి సూచించారు. సిటీలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్  బిల్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఆదర్శ్ సురభి మాట్లాడారు. ప్రతి ఒక్క బిల్ కలెక్టర్ వారికి ఇచ్చిన టార్గెట్లను వచ్చే రివ్యూ మీటింగ్ వరకు 10 శాతం పూర్తి చేయాలని చెప్పారు. నీటి పన్ను కూడా తప్పనిసరిగా వసూలు చేయాలని చెప్పారు. ఎవరైనా బిల్ కలెక్టర్ విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.